సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు ప్రకారంగా వేతనాల చెల్లింపునకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రక్రియను అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గురువారం దోమలగూడ ఏరియా ఏవీ కాలేజీ వద్ద కవాడిగూడ ఎస్ఎఫ్ఏ పరిధిలో శానిటేషన్ బృందాల హాజరు నమోదుపై ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో చేస్తున్న హాజరు విధానాన్ని పరిశీలించారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో లోపాలను సరిదిద్దామని, లైవ్ ఇమేజ్‌తో రెండు నుంచి మూడు సెకండ్లలో ఫొటో క్యాప్చర్‌తో హాజరు నమోదు అవుతున్నదని,
కండ్లు బ్లింక్ చేయకుండా ఫొటో క్యాప్చర్ కాదని స్నేహ శబరీష్ చెప్పారు. బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంకు ప్రతి సంవత్సరం రూ.2కోట్ల మేర ఖర్చు పెట్టగా, తాజాగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ సిస్టంకు రూ.64.50లక్షల ఖర్చు మాత్రమే అవుతుందని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 16,978 మంది శానిటేషన్ వర్కర్లు రోజువారీ అటెండెన్స్ నమోదు అవుతుందని, జూన్ 14న గూగుల్ ప్లే స్టోర్‌లో ఏఐఓఎస్ యాన్‌ను ఆపివేయడంతో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందన్నారు. శానిటేషన్ కార్మికులకు ఆధార్ బయోమెట్రిక్‌తో నెలవారీ వేతనాలకు రూ.33.5కోట్లు ఖర్చు అవుతుందని, ఫేస్ రికగ్నిషన్‌తో రూ.31 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు.