ఎన్నికల ఫిర్యాదులపై13 కాల్ చేయండిసిటీబ్యూరో, అక్టోబర్ ౧౩(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఫ్లయింగ్ స్కాడ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వేలెన్స్(ఎస్ఎస్టీఎస్) బృందాల పాత్ర కీలకమని అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్ సూచించారు. శుక్రవారం, జోనల్ డీసీపీలుసిటీ పోలీస్ ఎలక్షన్ సెల్ డీసీపీలు, నోడల్ ఏసీపీలు, ఇన్చార్జీలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలకు ఆన్లైన్లో శిక్షణ నిర్వహించారు.
టీఎస్పీఏ, అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరు ఏం చేయాలి? ఏం చేయకూడదు, స్పెషల్ టీమ్‌ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు(టోల్ ఫ్రీ నంబర్ 1950 )కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.