సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): నగరంలోని మియాపూర్‌లో నెయిల్స్ ఎన్ బియాండ్-నేచురల్ బ్యూటీ అకాడమీ ఫ్లాగ్షిప్ సెంటర్‌ను ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రారంభించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అందం ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తోందన్నారు. ఒకప్పుడు స్కిన్‌కు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారని ఇప్పుడు నెయిల్స్ లాంటి వాటికి కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చే ధోరణి పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ సీకే కుమార్వెల్, అరవింద్ కుమార్ పాల్గొన్నారు.