మాదాపూర్, జూలై 23: మహిళలు ఎంతగానో మెచ్చే బంగారు ఆభరణాలు, ప్రత్యేక డిజైన్లతో కూడిన ఫ్యాషన్ దుస్తులతో పాటు గృహోపకరణ ఉత్పత్తులకు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి నిహారిక కొణిదెల హాజరై, సాన్వి మేఘన, ఆక్టివిస్ట్, ైస్టెలిష్ ఎస్. సబితారెడ్డి, ఐశ్వర్య ఉల్లింగలతో పాటు ప్రముఖ మోడల్స్, నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో సరికొత్త డిజైన్లలో కూడిన వస్ర్తాలు, ఆభరణాలు, గృహోపకరణ ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం నటి నిహారిక మోడల్స్‌తో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది.