ఘట్కేసర్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి
సివిల్ వివాదంలో ఘట్కేసర్ పోలీసులు తలదూర్చి పిటిషనర్ తరపు న్యాయవాది సత్యనారాయణపై తప్పుడు కేసు నమోదు చేసి అగౌరవంగా మాట్లాడిన ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్
- విధులు బహిష్కరించి నిరసన తెలిసిన న్యాయవాదులు
- విచారణ జరుపుతాం : డీసీపీ సాయిశ్రీ
రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 21(నమస్తే తెలంగాణ): సివిల్ వివాదంలో ఘట్కేసర్ పోలీసులు తలదూర్చి పిటిషనర్ తరపు న్యాయవాది సత్యనారాయణపై తప్పుడు కేసు నమోదు చేసి అగౌరవంగా మాట్లాడిన ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామునాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టుల న్యాయవాదులు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాది సత్యనారాయణపై అక్రమంగా కేసు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి న్యాయవాదులతో చర్చలు జరిపారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్రం సుధాకర్‌రెడ్డి, పొన్నం దేవరాజ్ గౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, పీఠం ప్రదీప్‌కుమార్, దండెం రాంరెడ్డి, నర్సింగోజు నరేశ్‌కుమార్‌లు డీసీపీ వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్తానని డీసీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- DCP Saishri
- ghatkesar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

