ఖైరతాబాద్, అక్టోబర్ 14 : బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రత్యక్ష పోరాటమే మార్గమని ముదిరాజ్ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తట్టుకోలేని అగ్రవర్ణాలు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్‌లకు బీసీ జేఏసీలో స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు.
కనీసం కోర్కమిటీలోనైనా ముదిరాజ్‌లకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 18న జరిగే రాష్ట్ర బంద్‌ను బీసీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘాల ఐక్య వేదిక కోచైర్మన్లు జగన్ ముదిరాజ్, పండుగ బాలు ముదిరాజ్, డాక్టర్ గుండ్ల వెంకట్ ముదిరాజ్, డాక్టర్ బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, అంబర్పేట్ సతీశ్ ముదిరాజ్, రాజశేఖర్ముదిరాజ్, సాంబరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.