సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్యాంపస్ లోపల, బయట పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. విద్యుర్థులు సైతం వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, విద్యార్థులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. లోపలికి వచ్చినా, పనులు అడ్డుకున్నా కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచి దాదాపు 50కిపైగా ఇటాచీలు, బుల్డోజర్లు, జేసీబీలను రప్పించి ఫోకస్ లైట్ల మధ్య పెద్ద ఎత్తున చెట్లను నరికివేసి, భూమి చదును పనుల్లో వేగం పెంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. రాత్రి సమయంలో క్యాంపస్‌లోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్లను నరకడంతో ఆ చెట్లమధ్య ఆవాసం ఉన్న నెమళ్లు, జింకల వంటి జీవరాసులు అరుపులతో పరుగులు తీస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.
400ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అయితే ధైర్యంగా పనిదినాల్లో, పగలు సమయంలో కాకుండా సెలవు దినాలు, అర్ధరాత్రుల్లో ఎందుకు పనులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా క్యాంపస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకున్నారు.
బలగాల మోహరింపుతో భయానక పరిస్థితులు..
పోలీసు బలగాలతో క్యాంపస్ ఖాకీ వనంగా మారింది. స్థళాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన పనులను విద్యార్థులు అడ్డుకుంటుండడంతో బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు ఎస్వోటీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్తో పాటు అదనపు బలగాలను సైతం మోహరించారు. ఏకంగా టెంట్లు వేసి మరీ పోలీసు క్యాంప్‌లను
రాజ్‌భవన్ ఎదుట ఏబీవీపీ ధర్నా..
ఖైరతాబాద్, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఏబీవీపీ కార్యకర్తలు రాజ్ భవన్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబూనిన విద్యార్థులు ఇది ఇందిరమ్మ రాజ్యమా.. కబ్జాదారుల రాజ్యమా అని నినదించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పృథ్వీ మాట్లాడుతూ 400 ఎకరాల హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం ఆక్రమించాలని చూస్తున్నదని ఆరోపించారు.
ఈ విషయంలో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసుల దాడి, యూనివర్సిటీలోకి జేసీబీలు ప్రవేశించి భయాందోళన సృష్టించడం అమానుషమన్నారు. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, 400 ఎకరాల భూ అక్రమాలపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి అలివేలి రాజు, సభ్యులు మహేష్, బాలు, శ్వేత, విక్రమ్ ఆదిత్య, నందు, రాకేష్, ఆకాష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.