ABVP | పాఠశాల విద్యాశాఖ ఆఫీస్‌ను ముట్టడించిన ఏబీవీపీ.. సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదు ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
హైదరాబాద్: ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదు ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక, సరిపడా ఉపాధ్యాయులు లేక నానా అవస్థలు పడుతున్నారని, మరోవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతి ఏటా విద్యా సంవత్సవరం ఆరంభంలో చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని ఏబీవీపీ నాయకులు వెల్లడించారు.
సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే మరొకవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్న వైనం ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుంది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ,ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిననంతరం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.
ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలడి డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని, నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. డీఈఓ, ఎంఈఓలను వెంటనే నియమించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్, స్క్యావెంజర్లను నియమించాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

