ప్రజల అభీష్టం మేరకే అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం
అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం | ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

బంజారాహిల్స్,ఆగస్టు 11: ఫిలింనగర్ 18 బస్తీలకు చెందిన ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బుధవారం ఫిలింనగర్లో రెడ్‌ఫోర్ట్ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని 100 ఫీట్ల రోడ్డు పక్కన నిర్మించేందుకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రైవేటు సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించవద్దంటూ స్థానికులు కోరగా నిర్మాణ సంస్థతో మాట్లాడి సుమారు 700 గజాల స్థలంలో ఆలయాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించడం జరిగిందని, ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా వారే భరిస్తారని తెలిపారు. ఫిలింనగర్ 18 బస్తీల్లో ఎక్కడా లేని విధంగా మంచి ఆలయ నిర్మాణంతో పాటు స్థానికుల అవసరాల కోసం కల్యాణమండపాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. కాగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఉన్నచోటనే ఉంచాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆలయానికి ఎకరం స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

