సిటీబ్యూరో, మార్చ్ 26 (నమస్తే తెలంగాణ): అమెజాన్‌లో కర్టెన్స్ ఆర్డర్ పెడితే.. మురికి బట్టలు వచ్చాయంటూ నగరానికి చెందిన ఓ మహిళ లబోదిబోమంటోంది. ఈనెల 21న అమెజాన్‌లో ఆఫర్ ఉంది కదా అని.. కర్టెన్స్ ఆర్డర్ చేసింది. బుధవారం ఆర్డర్ ఇంటికి రాగా, పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో చెడు వాసనతో కూడిన మురికి బట్టలు మూడు కనిపించాయి.
ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తన అనుభవాన్ని తెలియజేస్తూ.. వీడియో వైరల్ చేసింది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను పూర్తిగా నమ్మవద్దని, అటువంటి వాటిలో జరిగే మోసాలతో వినియోగదారులుగా తాము నష్టపోతున్నామంటూ ఆ మహిళ చెప్పింది. కర్టెన్స్ బదులు వేరే మురికి బట్టలు వచ్చాయి.. కానీ అదే ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్స్పైరీ డేట్ కూడా లేకుండా పంపుతున్నారని, వీటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.