మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 20: కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనోజ్(47) భార్యాపిల్లలతో కలిసి నగరానికి వచ్చి మైలార్‌దేవ్‌పల్లి వినాయక్‌నగర్‌లో ఉంటున్నాడు.
వేసవి సెలవులు రావడంతో భార్యాపిల్లలు రాజస్థాన్‌కు వెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉంటూ పనులు చూసుకుంటున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో యజమాని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు క్లూస్ టీమ్ సహకారంతో డోర్‌ను పగులగొట్టి చూడగా మనోజ్ మాస్టర్ బెడ్రూమ్లో కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువులు, భార్యాపిల్లలకు సమాచారం అందించి.. మృతదేహాన్ని పోస్టుమార్ట