Shamshabad | శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 3 : కుటుంబ కలహాలతో తల్లీకూతురు అదృశ్యమైన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాలమాకుల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన మేకలబండతండాకు చెందిన కోడవాత్ మున్ని కూతురు సరిత, అల్లుడు నరేష్‌లు సంసారం విషయంలో గొడవలు పడుతున్నారు.
అయితే ఈ నెల ఒకటో తేదిన రాత్రి 9.30 గంటల సమయంలో సరిత(27) ఆమె కూతురు శ్రీవర్షిత(3)ను తీసుకొని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్లింది. మళ్లీ ఆమె తిరిగి రాలేదు. ఈ క్రమంలో భర్త నరేష్‌కు ఇంట్లో లేఖ లభిచింది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న… చనిపోతాను అని లేఖలో రాసి ఉంది. దీంతో పాటు ఫోన్లో నేను చనిపోతాను అంటు వాయిస్ రికార్డు చేసింది. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన ఫలితంలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.