బడంగ్పేట్, ఏప్రిల్ 12: ఓ ఇంటి సమస్య పరిష్కారం కోసం లెనిన్నగర్కు చెందిన తిరుపతయ్య అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అయితే న్యాయం చేయాలంటే మద్యం బాటిళ్లు కావాలని మీర్పేట్ పీఎస్లో లెనిన్ నగర్ సెక్టార్ ఎస్ఐ నాగభూషణ్ అడిగారు. దీంతో బాధితుడు ఆ అంశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎస్ఐ నాగభూషణ్ను సీపీ ఆఫీస్కు అటాచ్ చేసినట్లు సీఐ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు.