హైదరాబాద్ : హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు.. కారులోని ఓ వ్యక్తిపై కారం చల్లి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న బావర్చీ హోటల్ ఎదురుగా చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హయత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ హత్య అర్ధరాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో చంపేసి హయత్‌నగర్‌లో వదిలివెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బావర్చీతో పాటు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.