Musi River | హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. మరో వైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా మూసీలోకి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ వద్ద మూసీ ఉప్పొంగుతుండగా… చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
శంకర్ నగర్‌కు చేరుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు కలిసి గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వ్యక్తిని శంకర్ నగర్‌కు చెందిన సలీం(40)గా పోలీసులు గుర్తించారు. సలీం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.