బండ్లగూడలో పేలుడు.. ఉలిక్కి పడిన జనం
పాతనగరంలోని బండ్లగూడలో పెద్దశబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బాంబు పేలుడు జరిగిందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి.
- ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు
- వైద్యశాలకు తరలింపు
చాంద్రాయణ గుట్ట, డిసెంబర్ 17 : పాతనగరంలోని బండ్లగూడలో పెద్దశబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బాంబు పేలుడు జరిగిందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. బర్మా దేశానికి చెందిన హమీద్ హుస్సేన్ (55), నగరానికి వచ్చి కొంత కాలంగా బాలాపూర్ రాయల్ కాలనీలో ఉంటున్నాడు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం బండ్లగూడలో క్రిస్టల్ టౌన్‌షిఫ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిత్తు కాగితాలు ఏరుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది.
చుట్టుపక్కల ఇండ్లకు సంబంధించిన కిటికీలు పగిలిపోయాయి.చి త్తు కాగితాలు ఏరుకుంటున్న హుస్సేన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. విస్పోటనం జరిగిన తీరుకు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బండ్లగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా గాయపడిన హుస్సేన్‌ను వైద్యశాలకు తరలించారు. పేలుడుకు గల కారణాలు ఏమై ఉంటాయి. అసలు ఏ పదార్థం కారణంగా పేలుడు సంభవించి ఉంటుంది అనే కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

