కొంపల్లి వెన్‌కాబ్ చికెన్ ప్రధాన కార్యాలయంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర హాచరీస్ గ్రూప్ జనరల్ మేనేజర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యన్, హోప్ అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ రావుతో కలిసి లక్కీ డ్రా తీస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అడ్వైర్టెజ్‌మెంట్ జనరల్ మేనేజర్ ఎస్ సురేందర్ రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మెగుళ్ల రాజిరెడ్డి
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 వేడుకలు మంగళవారం కొంపల్లి వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా వినియోగదారులను మరింత ఉత్సాహపర్చేందుకు లక్కీ డ్రా బంపర్ ఆఫర్‌ను నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే అందుబాటులోకి తెచ్చాయి.
కొంపల్లిలోని వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్ కార్యాలయంలో వెంకటేశ్వర హెచరీస్ గ్రూప్ జనరల్ మేనేజర్ ఎస్.బాలసుబ్రహ్మాణ్యన్, హోప్ అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ రావు, నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే మార్కెటింగ్ విభాగం జీఎం ఎన్.సురేందర్‌రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డితో కలిసి 4వ లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా ఎన్. సురేందర్‌రావు మాట్లాడుతూ.. వ్యాపారస్తుల్లో ప్రజలకు ఖచ్చితమైన నమ్మకాన్ని తీసుకొచ్చేందుకు నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో గత పదేండ్లుగా దసరా బొనాంజతో అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు.
దీనిలో భాగంగానే వినియోగదారులను మరింత ఆకర్శించడంతో పాటు వారికి నాణ్యమైన వస్తువులను, సేవలను అందించేందుకు తమవంతు కర్తవ్యంగా ముందు వరుసలో నిలిచామన్నారు. ఈనెల 27వ తేదీ వరకు నగరంలోని పలుచోట్ల లక్కీ డ్రాలు కొనసాగనున్నట్లు తెలిపారు. టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై ఆల్మండ్ హౌజ్, ప్రోటీన్ పార్ట్నర్గా వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా.. హర్షా టోయోటా, కున్ హుందాయ్, వరుణ్ మోటార్స్, మానెపల్లి జ్యువెల్లర్స్, శ్రీసిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్ట్నర్గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నాయన్నారు.
కొంపల్లి వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన లక్కీడ్రాలో మొదటి బహుమతి వరుణ్ మోటర్స్ వినియోగదారుడు గతిన్ కుమార్ ఆయువ్(కూపన్ నంబర్ 006371)కు 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ, రెండో లక్కీ డ్రాలో సీఎంఆర్ ఉప్పల్ వినియోగదారుడు సంజీవ్‌కుమార్(కూపన్ నంబర్ 009001) ద్వారా స్మార్ట్ ఫోన్, మూడో విజేత సీఎంఆర్ హయత్‌నగర్ వినియోగదారురాలు ఎ.గిరిజ(కూపన్ నంబర్ 008704) గిప్ట్ఓచర్, 4వ విజేత సీఎంఆర్ ఉప్పల్ వినియోగదారురాలు లక్ష్మిఅనురాధరెడ్డి(కూపన్ నంబర్ 008585) గిప్ట్ఓచర్ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్, సుమన్ టీవీ బృందంతో పాటు వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రొటీన్ భాగస్వామిగా పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది
నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ బొనాంజా 2025లో వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్ ప్రొటీన్ భాగస్వామిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. ముందుగా 4వ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు అభినందనలు. రైతులకు, వినియోగదారులకు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగకు బొనాంజ నిజమైన ప్రారంభ వేడుకల ఆనందాన్ని, ఉత్సాహన్ని అందించాయి. ఇటువంటి కార్యక్రమాలు అటు కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని, ఇటు అమ్మకందారులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.
– ఎస్ బాలసుబ్రహ్మణ్యన్, జనరల్ మేనేజర్, వీహెచ్ గ్రూప్
వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది
దసరా బొనాంజతో వినియోగదారులకు, పాఠకుల ముందుకు ఖచ్చితమైన, నాణ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చేందుకు నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే అగ్రగామిలో నిలవడం సంతోషకరం. పండుగ వేళలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో లభించే వస్తువులను సరసమైన ధరలకు అందించి, ప్రతి వినియోగదారుడి ఇంటికి ఇటువంటి పారదర్శకమైన లక్కీడ్రాల ద్వారా బహుమతులు అందచేయడం సంతోషంగా ఉంది.
– కేఎస్ రావు, మేనేజింగ్ డైరెక్టర్, హోప్ అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్