నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
- రూ.7.25 లక్షల సొత్తు సీజ్
- వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5: నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మార్పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సర్వర్ షరీఫ్(28) న్యూహఫీజ్పేట్లో నివాసముంటున్నాడు. 2019 సంవత్సరంలో స్థానికంగా ఉన్న అదిత్యనగర్‌లో అమీరా కమ్యూనికేషన్స్ పేరిట కస్టమర్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ వాహన జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారుచేసి రూ.500 మొదలు రూ.2500 వరకు విక్రయించడం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర నుంచి వలసవచ్చి పటాన్‌చెరువులో నివాసముంటున్న తన స్నేహితులు మిర్జా ఇలియాజ్ బేగ్(62), న్యూహాఫీజ్పేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ జమీల్ అహ్మద్(46)లతో కలిసి ద్విచక్ర, ఆటో, కార్ల వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌లు నకిలీవి తయారుచేసి విక్రయిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు ఆదిత్యనగర్‌లోని వారి కార్యాలయంపై దాడిచేశారు. ఐసీఐసీఐ, యునైటెట్ ఇండియా, భారతీ, హెచ్డీఎఫ్సీ వివిధ కంపెనీలకు చెందిన 116 నకిలీ ఇన్సూరెన్స్‌లు, డిజిటల్ ప్రింటర్, 2 కంప్యూటర్లు, రబ్బర్ స్టాంప్, 4 సెల్ఫోన్లు, రూ.79 వేల నగదు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2019లో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసిన నేరంలో మహ్మద్ సర్వర్ షరీఫ్ జైలుకు వెళ్లివచ్చాడు. దాదాపు 300 నకిలీ జనరల్ వాహన ఇన్సూరెన్స్‌లు తయారుచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాతో సంబంధమున్న మరో నిందితుడు హాఫీజ్పేట్కు చెందిన అజార్ పరారీలో ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ రషీద్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, ఇన్స్పెక్టర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

