హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి.
తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ(Dundigal Municipality) పరిధిలోని బౌరంపేట్ గ్రామ పంచాయతీ సమీ పంలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక హాస్పిటల్కు తరలింపు. లించారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.