హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న దేశానికి ఓ గుడ్‌న్యూస్. రష్యాకు చెందిన మరో 30 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో మంగళవారం ల్యాండయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేకంగా చార్టర్డ్ రవాణా విమానం మంగళవారం తెల్లవారుఝామున 3.43 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినట్లు జీఎంర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వెల్లడించింది. గతంలోనూ రెండు సార్లు ఈ వ్యాక్సిన్ కన్సైన్మెంట్లు ఇక్కడికి వచ్చినా.. ఇంత భారీ స్థాయిలో రావడం మాత్రం ఇదే తొలిసారి.
90 నిమిషాల్లోనే ఈ షిప్మెంట్ ఎయిర్‌పోర్ట్‌లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకొని బయటకు వచ్చిందని ఆ ప్రకటనలో జీహెచ్ఏసీ తెలిపింది. ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను -20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన మూడో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఇండియాలో మొత్తం 25 కోట్ల వ్యాక్సిన్ వయల్స్‌ను విక్రయించడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్స్‌లో వేయనున్నారు.
Telangana: A consignment of Sputnik V arrived from Russia on a specially chartered freighter at Hyderabad Airport earlier today pic.twitter.com/9zmkC86DtR
— ANI (@ANI) June 1, 2021