మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:52:42

కుదిరిన ఒప్పందం

కుదిరిన ఒప్పందం

సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన ఫలాలను సమాజానికి అందించేందుకు మర్రిలక్ష్మణ్‌ రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం కళాశాల కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో ఎంఎల్‌ఆర్‌ఐటీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. శ్రీనివాస్‌, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ రవికుమార్‌ సంతకాలు చేశారు.  ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక బదలాయింపుతో  కళాశాల విద్యార్థులు, అధ్యాపకులకు నూతన ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ రవికుమార్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుణ్‌, టీసీవోఎస్‌టీ ప్రతినిధులు పి. శ్రీనివాస్‌, సీవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo