సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:40:53

ముగిసిన కేంద్ర బృందం పర్యటన

ముగిసిన కేంద్ర బృందం పర్యటన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరానికి వచ్చిన కేంద్ర బృందం తన పర్యటన ముగించుకొని ఆదివారం ఢిల్లీకి వెళ్లింది. అరుణ్‌ భరోక నేతృత్వంలోని అంతర్‌ మంత్రిత్వశాఖ అధికారులు ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి మే 2 వరకు నగరంలో విస్తృతంగా పర్యటించారు. కంటైన్మెంట్‌ జోన్లలో అమలు చేసిన నిబంధనలు, నిత్యావసరాలు, కూరగాయల సరఫరా, పేదలు, వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించారు. వైద్యశాలలు, మార్కెట్లు, అన్నపూర్ణ క్యాంటిన్లు, నియంత్రిత ప్రాంతాలు,  యాచకుల సంరక్షణ కోసం నెలకొల్పిన షెల్టర్‌ హోం తదితర వాటిని తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో  కరోనా నివారణ చర్యలపై చర్చించారు. జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ -19 కంట్రోల్‌ రూంలను సందర్శించి అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని  అభినందించారు. 


logo