Cyber Crime | సైబర్ నేరం జరిగిందా.. అయితే వెంటనే 1930కు కాల్ చేయండి
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్‌నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్‌క్రైమ్ కాల్‌సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 700 వరకు చేరుకుంది.
- 24/7 అందుబాటులో సిబ్బంది
- కాల్‌సెంటర్‌తో బ్యాంక్‌ల రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్స్ అనుసంధానం
- సైబర్ నేరాల కట్టడికి కసరత్తు
Cyber Crime | సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్‌నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్‌క్రైమ్ కాల్‌సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 700 వరకు చేరుకుంది. అందులో 250 కాల్స్ వరకు కొత్త ఫిర్యాదులు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగతా కాల్స్.. గతంలో ఫిర్యాదు చేసిన వారి నుంచి కేసుల పురోగతి సమాచారం కోసం వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా.. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు డయల్ 100కు కాల్ చేసినా.. ఆ కాల్ నేరుగా సైబర్ క్రైమ్ కాల్ సెంటర్‌కు వచ్చే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.
సైబర్ నేరాల అడ్డుకట్టకు..
సైబర్ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఈ కాల్ సెంటర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి, 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్ పనిచేస్తుంది. ఈ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే కాల్స్ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక కాల్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు 5 నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో వచ్చే కొత్త కాల్స్.. సాఫ్ట్వేర్ సహాయంతో ఖాళీగా ఉన్న సిబ్బందికి వెళ్తుంటాయి.
బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్‌లతో..
ఈ కాల్ సెంటర్‌కు ఆయా బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్‌లు అనుసంధానమై ఉంటాయి. ఆయా బ్యాంకులు సైబర్‌నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, తమ వైపు నుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. దీంతో కాల్‌సెంటర్ నుంచి సమాచారం వెళ్లగానే.. ఆయా బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ అప్రమత్తమై బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి, ఆ ఖాతాలను ప్రీజ్ చేస్తారు. నేరగాళ్లు ఆ ఖాతాల్లో నుంచి డబ్బు డ్రా చేయకుండా ఉంటే.. అందులో ఉండే నగదు కూడా ప్రీజ్ అవుతుందని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి.!
సైబర్‌నేరగాళ్లు ఎదో ఆశ చూపి వల వేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి.. ఏదైనా స్కీమ్ గురించి చెబితే వివరాలు తెలుసుకోవడం క్షేమమన్నారు. కనీసం తెలిసిన వ్యక్తులతోనైనా చర్చించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో గూగుల్‌లో సెర్చ్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్‌క్రైమ్ టోల్‌ప్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
RTC Elections | ఆర్టీసీ కార్మికలోకం కుతకుత.. గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
Parental Controls | పిల్లల వాట్సప్ వాడకంపై తల్లిదండ్రులకే కంట్రోల్..కొత్త ఫీచర్లతో మెటా కీలక నిర్ణయం!
Birth Control Pill | మహిళలకే కాదు.. పురుషులకూ గర్భనిరోధక మాత్ర?.. అరగంట ముందు వేసుకుంటే చాలు!
KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై స్టేటస్కో.. జప్తు చర్యలకు హైకోర్టు బ్రేక్.. నవంబర్ 6 వరకు యథాతథ స్థితి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

