సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : స్టార్టప్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 16వ తేదీని నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించారు. ఈనేపథ్యంలో జనవరి 16న టీహబ్‌లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, నిపుణులతో ప్రత్యేకంగా ఒక రోజు వర్క్‌షాపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://bit.ly/3tLGUFL లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని టీహబ్ నిర్వాహకులు సూచించారు.