శామీర్‌పేట, సెప్టెంబర్ 11 : పేకాట స్థావరంపై(Poker game) పోలీసులు మెరుపు దాడి(Police raid) చేశారు. 13 మందితో పాటు రూ.4 లక్షల 30 వేల నగదు, సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శామీర్‌పేట(Shameerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్, జీడిమెట్ల ప్రాంతానికి చెందిన 13 మంది వినాయక నిమజ్జనాల కోసం శామీర్‌పేట చెరువు వద్దకు వచ్చారు.
నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత వీరిలో ఒకరి జన్మదిన వేడుకల్లో భాగంగా మూడుచింతలపల్లి మండలం ఉషార్‌పల్లి గ్రామ పరిధిలో ఒక ఫామ్ హౌస్‌ను తీసుకున్నారు. జన్మదిన వేడుకలు పేరుతో పేకాట ఆడుతు న్నారనే పక్కా సమాచారంతో ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మందితో పాటు రూ.4 లక్షల 30 వేలు, 13 సెల్ ఫోన్లు, 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.