పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా

- ఓ మహిళా డ్యాన్సర్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుందామని ఓ వెబ్సైట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసిం ది.. దీన్ని చూసిన సైబర్ నేరగాడు.. మీ ప్రొఫైల్ నచ్చిం ది.. నేను యూకేలో బీఎండబ్ల్యూ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాను.. పెండ్లికి ముందు విలువైన గిఫ్ట్ పంపిస్తానంటూ నమ్మించి.. డ్యాన్సర్ నుంచి రూ. 11.75 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరా ల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన ఓ మహిళ డ్యాన్సర్ షాది.కామ్‌లో పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసింది. ఆ ప్రొఫైల్ చూసిన గుర్తు తెలియని వ్యక్తి ( సైబర్ నేరగాడు ) తాను భారతీయుడినే.. అయితే ప్రస్తుతం యూకేలో బీఎండబ్ల్యూ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఒకరికొకరు నచ్చడంతో పెండ్లికి చేసుకుందామనుకున్నారు. తాను ఇప్పటికే భారీగా సంపాదించానని, నేను ఇండియాకు రాకముందే నిన్ను సర్ప్రైజ్ చేసే అద్భుతమైన గిఫ్ట్‌ను పంపిస్తానని, కొన్ని ఆభరణాలు, డాలర్లు, ల్యాప్‌టాప్‌లు ప్యాక్ చేస్తున్నట్లు.. వాటి ఫొటోలను వాట్సాప్‌లో పంపించాడు. రెండు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఆమెకు ఫోన్‌చేసి.. మీ పేరుతో పార్శిల్ వచ్చింది, అందులో డాలర్లు, విలువైన ఆభరణాలు ఉన్నాయని, వాటికి కస్టమ్స్ చార్జీ లు చెల్లించాలంటూ ఆమె నుంచి రూ. 11.75 లక్షలు వసూలు చేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
మరికొన్ని ఘటనలు..
- సోషల్‌మీడియాలో పెట్టిన తన వీడియోలకు కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని ఓ న్యూస్ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లోని ఒక అక్షరాన్ని మార్చి వెబ్సైట్, ఈ మెయిల్ ఐడీతో ఉద్యోగాలు ఇప్పిస్తామం టూ అమాయకులను మోసం చేస్తున్నారని, ఆ సంస్థ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనలు చూసి ఫోన్, కెమెరాకు రూ.87,300 చెల్లించిన తరువాత, ఆ వస్తువులు రాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితులు ఇచ్చిన ఆయా ఫిర్యాదులపై సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

