గోల్నాక, ఫిబ్రవరి 18 : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన మొత్తం రూ.10లక్షల84 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబసభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యాలయం అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు తీసుకొని సులువుగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారన్నారు. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపుతూ వీలైనంత త్వరగా బాధితులకు చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.