గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 04, 2020 , 03:44:24

‘ఇజ్జత్‌నగర్‌' వేలానికి వేళాయే..!

‘ఇజ్జత్‌నగర్‌' వేలానికి వేళాయే..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ సోమవారం మాసబ్‌ట్యాంకులో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌, హెచ్‌ఎండీఏ భూముల వేలం ఇతరత్రా అంశాలపై అధికారులతో అరవింద్‌కుమార్‌ చర్చించారు. భూముల వేలం ప్రక్రియలో భాగంగా తొలుత హైటెక్‌ సిటీ ఇజ్జత్‌నగర్‌ భూములను వేలం వేసేందుకు చర్యలు వేగిరం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్జత్‌నగర్‌లో సర్వే నం.5 నుంచి 5/20లలో మొత్తం దాదాపు 30ఎకరాలు ఉండగా, తొలి విడతలో 16 ఎకరాలను రెండు బిట్లుగా చేసి వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అరవింద్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 


వచ్చే నెలాఖరులోగా వేలం ద్వారా నిధులను సమకూర్చాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పాటు సంస్థకు సంబంధించిన భూములన్నింటినీ డిజిటలైజ్డ్‌ చేయాలని, సమగ్ర వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాన్ని అధికారులు అరవింద్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లగా 100 శాతం ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్‌ తక్షణమే జారీ చేయాలని ఆదేశించారు. ఫీజు చెల్లించాలంటూ సమాచారం అందుకున్న వారికి మరో అవకాశం ఇవ్వాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగిసినందుకు వీరి నుంచి అదనంగా 10శాతం రుసుం వసూలు చేయాలని చెప్పారు.


logo
>>>>>>