Weekly Horoscope | మేషం
భార్యాపిల్లలతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దలు, బయటి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పిల్లల చదువు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో మనస్పర్ధల వల్ల మానసిక ఇబ్బందులు రావచ్చు. చేబదుళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం
మెరుగైన ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బందులు ఉన్నా, పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో ఆటంకాలు ఉండవు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో సామరస్యం ఉంటుంది. ఉల్లాసంగా పనులు చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం అవసరం. వాహనాల వల్ల ఖర్చులు. స్నేహితులు, బంధువులతో మనస్పర్ధలు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు కొంత ఇబ్బంది పడతారు. పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థుల చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు దక్కుతాయి. డబ్బు ఆలస్యంగా వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృథా ఖర్చులు తప్పవు.
కర్కాటకం
అనుభవజ్ఞుల సలహాలు అందుతాయి. వ్యాపారం లాభదాయకం. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కొత్త పనులను చేపడతారు. న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తిలో వారికి సంతృప్తికరం. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో కొంత ప్రయోజనం ఉంటుంది. తోటివారితో జాగ్రత్త. డబ్బు సమయానికి తిరిగిరాదు. ఉద్యోగ, వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. దేవతా, గురుభక్తి పెంచుకోవడం అవసరం.
సింహం
విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఉంటాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులను చేపడతారు. పెద్దలు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. భార్యా పిల్లలతో సంతృప్తికరంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అధిష్టానం అండదండలు ఉంటాయి. ఉద్యోగులకు తోటివారితో గొడవలు ఏర్పడతాయి. వ్యవసాయదారులు లాభాలు గడిస్తారు. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
కన్య
ఉత్సాహం కనబరుస్తారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. మంచి పేరు పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే, ఆలోచనతో పనులు చేయాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం జరుగవచ్చు. విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులు, బంధువులతో వాగ్వాదాలు తలెత్తవచ్చు.
తుల
పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ధైర్య సాహసాలతో పనులు చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి. భక్తి భావన, ఆధ్యాత్మికత పెంపొందుతాయి. అనవసర ప్రయాణాల వల్ల అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారిని కొత్త అవకాశాలు దూరం నుంచి ఊరిస్తాయి. న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. వ్యాపారంలో ఇబ్బందులు అధిగమిస్తారు. వృథా ఖర్చులు వద్దు.
వృశ్చికం
అన్నివిధాలా కలిసి వస్తుంది. న్యాయవాదులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురితో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. మంచిపేరు సంపాదిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు చేస్తారు. స్థిర, చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నం సంతృప్తినిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. తోటి ఉద్యోగులతో కలహాలు ఉంటాయి. భాగస్వాములతో విభేదాలకు అవకాశం ఉంది.
ధనుస్సు
భార్యాపిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్దల సహాయ సహకారాలు, కార్యకర్తల మద్దతు అందుతాయి. నిర్ణయాలు తీసుకునే ముందు లోతైన ఆలోచన అవసరం. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. రుణభారం వల్ల పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. నిర్మాణ, వ్యవసాయ రంగాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు.
మకరం
కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు లాభదాయకం. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండటం అవసరం. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సహాయ సహకారాలు పాటిస్తూ ముందుకు పోవాలి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధలు ఉంటాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు.
కుంభం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత అధికం అవుతుంది. విద్యార్థులు రాణిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కలిసి వస్తాయి. అన్నదమ్ములు, ఆత్మీయులు అనుకూలంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త. వృథా ప్రయాణాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్, వడ్డీ వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది.
మీనం
ఆదాయం పెరుగుతుంది. పనివారితో అనుకూలత ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది. కుటుంబసభ్యులతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వృత్తిలో ఉన్నవారికి చిన్నపాటి అశాంతి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉద్యోగులకు తోటివారితో కలహాలు ఎదురుకావచ్చు. పెద్దల సూచనలు విస్మరించవద్దు.