రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు జోరందుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితులకు సాయం చేస్తారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. స్నేహితులతో కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ నాయకుల పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.
ఈ వారం శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల పనులు నెరవేరుతాయి. వారాంతంలో అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మనశ్శాంతి కోసం విహారయాత్రలకు వెళ్తారు. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు కేసులు వాయిదా పడవచ్చు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారులతో భేదాభిప్రాయాలు కలగవచ్చు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. భూ లావాదేవీల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనం మూలంగా ఖర్చులు ముందుకువస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు నిరాటంకంగా కొనసాగుతాయి.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. కళాకారులకు మంచి సమయం.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. నలుగురికీ సాయపడతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం పొందుతారు. అదృష్టం కలిసివస్తుంది. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతి అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంగా ఉంటారు.
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులలో మొదట ఆటంకాలు వచ్చినప్పటికీ.. వారాంతానికి పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులకు మంచి సమయం. అయితే, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. కోర్టు తీర్పులు అనుకూలంగా వెలువడుతాయి.
పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అయితే, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వేళకు భోజనం చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచిపేరు పొందుతారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమ పెరిగినా అందుకు తగ్గ గుర్తింపూ లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ పనుల్లో కదలిక ఉంటుంది. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికీ సాయపడతారు. గతంలోని పెట్టుబడుల మూలంగా ఆదాయం వస్తుంది.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నలుగురి సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. పట్టుదలతో పనులు చేస్తారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. రైతులకు మంచి దిగుబడి వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పట్టుదలతో సత్ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మంచిస్థాయిలో ఉన్న వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గృహ నిర్మాణంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఆత్మీయులతో మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.