చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒప్పందాలు కలిసివస్తాయి. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినప్పటికీ, సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పంద ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు.
సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృథా ఖర్చులు ముందుకురావచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అధికారులతో సఖ్యతతో మెలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అనుకూల స్థానచలనం, పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలపై మనసు నిలుపుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.
ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురికి సాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకు బడితో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో మాటపట్టింపులు ఉండవచ్చు. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఆస్తి వ్యవహారాల్లో అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. నాన్చివేత ధోరణితో కాకుండా పరిష్కార మార్గాలు వెతకడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ప్రారంభించిన పనులు నిర్ణీతకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు పేరున్న సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా చూసుకోవడం మంచిది. శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. కొత్తపనులు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. ఖర్చుల నియంత్రణ పాటించాలి.
అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఆస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. ఆగిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. అధికారుల సహకారంతో మంచిపేరు సంపాదిస్తారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలనం ఉండవచ్చు. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆర్థిక ఒప్పందాల్లో ఏమరుపాటు తగదు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు.
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు, సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా ఈ వారం బాగుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులలో శ్రమాధికం ఉండవచ్చు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అనవసరమైన ఖర్చులు ఎదురైనా, ఆదాయం స్థిరంగా ఉండటంతో ఇబ్బంది ఉండదు.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన వివాదాల్లో తల దూర్చకండి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి, కార్యనిర్వహణపై మనసు నిలపండి. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది.