పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. స్నేహితులు, బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం.
బంధుమిత్రులను కలుసుకుంటారు. పనులు అనుకూలంగా పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూతగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల పనితనానికి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. రాజకీయంగా కలిసివస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కొత్త స్నేహితులతో పనులు నెరవేరుతాయి. బాధ్యతతో మెలుగుతారు.
కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వివాదాలు తొలగిపోతాయి. బంధువులతో అనుబంధం పెరుగుతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. అన్నిటా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శ్రమ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఫలితం పొందుతారు. పిల్లల విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రాబడికి లోబడి పనులు చేస్తారు. అధికారుల ప్రశంసలు, బంధువర్గం ఆదరణ పొందుతారు. శుభకార్యాలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు సంతృప్తిని ఇస్తాయి. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు.
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కోర్టు పనులు కలిసివస్తాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. పనితనానికి గుర్తింపు పొందుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. బంధుమిత్రులు రావడంతో ఖర్చులు పెరగవచ్చు. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదురుతుంది. తగాదాలకు దూరంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. భక్తి పెరుగుతుంది.
నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార ఒప్పందాలు విజయవంతం అవుతాయి. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. డబ్బు అందుతుంది. కొత్త పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ప్రభుత్వ సర్వీసు పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. ఆత్మీయులు, కుటుంబ పెద్దల సహకారంతో ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయంగా పలుకుబడి సాధిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వాహనం కొనుగోలు, ఇంటి మరమ్మతులు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ఆస్తులు, భూముల విషయంలో అనుకూలం. దృఢ సంకల్పంతో ఉంటారు. పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అనవసరమైన ఆలోచనలతో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రాజకీయంగా గుర్తింపు పొందుతారు. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కష్టానికి సరిపడా ఫలితం పొందుతారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది.
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణంలో గతంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. భక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొన్ని విషయాలలో వృథా ఖర్చులు ముందుకు రావచ్చు. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అయినప్పటికీ, చేతికి డబ్బు అందడంలో ఆలస్యం అవుతుంది.
గతంలో అప్పుగా ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు.బంధుమిత్రాదులతో కార్యసాఫల్యం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగులకు స్థాన చలన సూచన. సహోద్యోగుల సహకారంతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి, చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో ముందుకు కొనసాగుతాయి.
బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆలస్యంగా అయినా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పెద్దల విషయంలో భక్తితో ఉంటారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కొత్త పనులకు అనుకూలమైన వారం కాదు. చేతిలో ఉన్న పనులను పూర్తిచేయడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. రాజకీయంగా మంచి పేరు లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబసభ్యుల సహకారంతో మనశ్శాంతి పొందుతారు. విందులకు హాజరవుతారు.
రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. కష్టానికి సరిపడా ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. భక్తి పెంపొందుతుంది. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబ పెద్దలు, అనుభవజ్ఞుల సూచనలను అమలు చేస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలుకు అవకాశం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయంగా కలిసివస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. శుభకార్యాలకు సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుసుకుంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. ఆదాయం పెంచుకొనే మార్గాలపై మనసు నిలుపుతారు. వ్యాపారం నిలకడగా ఉంటుంది.