వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అదృష్టం కలిసివస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక సేవా సంస్థలతో కలిసి పనిచేస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం అందుతుంది.
రాజకీయ పనులు కలిసివస్తాయి. శ్రమ పెరుగుతుంది. అయితే పట్టుదలతో పనిచేస్తారు. పెద్దల సహకారం అందుతుంది. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. దిగుబడి పెరుగుతుంది. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
అదృష్టం కలిసివస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ప్రారంభించిన పనుల్లో కాలయాపన ఉండవచ్చు. వారాంతానికి మళ్లీ వేగం పుంజుకుంటాయి. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త పనుల జోలికి వెళ్లకుండా చేతిలో ఉన్నవాటిని పూర్తి చేసుకోవడం మంచిది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
ప్రయాణాలు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. చేతినిండా డబ్బులు ఉంటాయి. అయితే, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి.
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. భూ తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. నలుగురికీ సాయపడతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం పొందుతారు. అదృష్టం కలిసివస్తుంది. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతి అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంగా ఉంటారు.
ఓపికతో పనులను పూర్తిచేసుకోవాలి. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. స్నేహితులతో వృథా చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో ముందడుగు వేయండి. శ్రమ అధికం కావడం వల్ల శారీరకంగా ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలపాలి. బంధువుల సహకారం లభిస్తుంది.
బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయం ఆలోచిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం కలిసి
వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ
మర్యాదలు లభిస్తాయి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు.
గతంలో నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ, సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. కోర్టు కేసుల్లో పురోగతి కనిపిస్తుంది. బంధువర్గం సహకారం లభిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. ఇరుగుపొరుగు వారితో సంబంధాలు మెరుగవుతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది తోడ్పాటు లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ పాటించాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఈ వారం కష్టేఫలి అన్నట్లుగా సాగుతుంది. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. అన్నదమ్ములు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబడి పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.