Weekly Horoscope | మేషం
నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. విద్యార్థులు సంతృప్తికరంగా ఉంటారు. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. అధికారుల సహాయ సహకారాలతో పనులు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.
వృషభం
గతంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అయినా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. బంధువర్గంతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా, పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం.
మిథునం
వృత్తిలో సంతృప్తి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం అవసరం. విద్యార్థులకు అనుకూలమైన వారం. అయినా శ్రమించాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, పై అధికారులతో మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి, అందరినీ కలుపుకొని పోవాలి. ఏకాగ్రతతో పనులు చేస్తారు. డబ్బు ఆలస్యంగా అందడం వల్ల కొన్ని పనులలో జాప్యం జరగవచ్చును. వ్యవసాయదారులకు అనుకూలిస్తుంది.
కర్కాటకం
ఉన్నత విద్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయిలో నిలుస్తారు. మంచి కొలువులో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
సింహం
డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి.
కన్య
గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దైవిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారం కలిసి వస్తుంది. ప్రభుత్వ పనులలో జాప్యం జరగవచ్చు. ఖర్చులు పెరిగినా కోర్టు కేసులలో సత్ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. చుట్టుపక్కల వారితో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. పెద్దల సలహాలను ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు.
తుల
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. ఆఫీసులో పనిభారం ఎదుర్కొంటారు. అయినా సమస్యలను అధిగమిస్తారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టులో అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతోషంగా పనులు పూర్తిచేస్తారు. వృథా ఖర్చులు ఉండవచ్చు. వ్యయాలపై నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంతృప్తికరంగా పనులను పూర్తిచేస్తారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం. ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. తద్వారా కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది.
ధనుస్సు
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సంతృప్తికరంగా ఉంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం. కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల తగాదాలు కొలిక్కి వస్తాయి. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు పొందుతారు.
మకరం
పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. ప్రారంభించిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొత్తానికి పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రాబడిలో అస్థిరత వల్ల పనులలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి సిబ్బంది సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. ఉన్నత విద్య ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటి.
కుంభం
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. పెద్దల సలహాలు, సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కళాకారులకు అనుకూలిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల పట్ల రెట్టింపు శ్రద్ధ అవసరం. కొనుగోళ్లు వాయిదా పడవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం.
మీనం
విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. పెద్దలతో గౌరవంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రారంభించిన పనులను సంతృప్తిగా, లాభదాయకంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.