అదృష్టం కలిసివస్తుంది. శ్రద్ధగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.
రాబడికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. పనివాళ్లతో సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చికాకులు తలెత్తవచ్చు. వారాంతంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోతాయి. వారం చివర్లో శుభవార్త వింటారు. అపరిష్కృతంగా ఉన్న సమస్య తీరుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో పూర్తి చేస్తారు. అనుకూల స్థానచలన సూచన. అధికారుల అండదండలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. విహారయాత్రలకు వెళ్తారు.
అనుకున్న పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. అకాల భోజనం వల్ల అనారోగ్య సూచన. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. బంధువులతో వాదోపవాదాలు చోటుచేసుకోవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. గృహనిర్మాణ రంగంలో ఉన్నవారికి వారాంతంలో ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు.
ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల అండదండలు ఉంటాయి. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల విజయం వరిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల అలసట ఏర్పడవచ్చు.
అధికారులతో వాగ్వివాదాలు ఏర్పడవచ్చు. సంయమనం పాటించడం అవసరం.
చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తిచేస్తారు. రోజువారీ లావాదేవీలు సజావుగా సాగుతాయి. పనివారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. బంధువులతో సఖ్యత ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాలను పాటించడం అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. వారాంతంలో అదృష్టయోగం ఉంది. అపార్థం చేసుకునేవారు ఉన్నారు. తొందరపాటు నిర్ణయాలు తగదు.
వారం మొదట్లో చికాకులు తలెత్తుతాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. వారాంతానికి పరిస్థితి కుదుటపడుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా కొన్నిచికాకులు తలెత్తుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవాళ్లకు పని వాళ్లతో చికాకులు తలెత్తుతాయి. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రతికూల ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కార్యసాఫల్యం ఆలస్యం అవుతుంది. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.
శ్రద్ధతో పనులు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యతతో ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. రోజువారీ వ్యాపారంలో ఒడుదొడుకులు రావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళితే సత్ఫలితాలను పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసివస్తుంది. ఆప్తుల మాటసాయం బలాన్నిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా పనులు చేస్తారు.
నలుగురిలో పేరు సంపాదిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. పెద్దల సలహాలను పాటించడం అవసరం. ఆర్థిక సమస్యలు క్రమేపీ దూరమవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో సఖ్యతగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు.
అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాల వల్ల అలసట ఏర్పడుతుంది. పనివారితో సమస్యలు రావచ్చు. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల అందడండలు లభిస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.
అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పని భారం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవలసి రావచ్చు. సంఘంలో పలుకుబడి మూలంగా పనులు పూర్తవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో ఫలితాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో విభేదాలు రావచ్చు. అయితే సంయమనంతో వ్యవహరించండి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. మంచి సంస్థలో చేరతారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనులలో శ్రమ పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. సాహ సోపేత నిర్ణయాలను తీసుకుంటారు. వాహనం, భూమి కొనుగోలుపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారాన్ని పొందుతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారులకు మంచి సమయం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల సూచనలను గౌరవిస్తారు. పలుకుబడితో పనులు పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.