Weekly Horoscope | మేషం
ప్రయాణాలు కలిసివస్తాయి. పనులను శ్రద్ధతో నిర్వర్తిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్య కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఇంట్లో భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అయితే, ఖర్చులు నియంత్రించుకోవాలి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఉద్యోగులకు అధికారుల అనాదరణ ఎదురుకావచ్చు. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
వృషభం
రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కలిసి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల మీద కొంత ఆలోచన అవసరం. నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఒడుదొడుకులు ఉంటాయి. అన్నదమ్ములు, స్నేహితులతో అనవసరమైన గొడవలు తలెత్తుతాయి. వాహనాల వల్ల ఖర్చులు, ప్రయాణాల వల్ల అనారోగ్యం కలుగవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా పడుతాయి. గణపతిని ఆరాధించాలి.
మిథునం
పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు, పిల్లల ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. భార్యాపిల్లలతో
సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారి ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు తోటి సిబ్బంది సహాయ సహకారాలు అందు తాయి. అనవసర ప్రయాణాల వల్ల అనారోగ్యం పాలవుతారు. నవగ్రహ స్తోత్రం పఠించాలి.
కర్కాటకం
భార్యాపిల్లలతో సుఖంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసి వస్తుంది. సిబ్బందితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అనుభవజ్ఞుల సూచనలు, సలహాలను పాటించడంతో చాలా పనులు ముందుకు సాగుతాయి. అన్నదమ్ములు, ఆత్మీయుల ప్రేమానురాగాలు లభిస్తాయి. కులదేవతను స్మరించుకోవాలి.
సింహం
ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల కొంత అనుకూలత ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. ఫలితంగా కొంతవరకు నష్టాలను తగ్గించుకుంటారు. ఇంట్లో భార్యా పిల్లలతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి కొత్త అవకాశాలు తగ్గుతాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగవు. పెద్దల పట్ల గౌరవం లోపించకుండా జాగ్రత్త పడాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.
కన్య
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు కొంత కలిసివస్తుంది. ఇంట్లో భార్యాపిల్లలతో వాగ్వాదాలు, ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్ధలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు ముందుకు సాగవు. డబ్బు సమయానికి చేతికి అందదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, వృథా ప్రయాణాలు, అలసట, అశ్రద్ధ, ఆత్మీయులతో వైషమ్యాలు ఎదురవుతాయి. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. మనశ్శాంతి కోసం ఏదైనా శక్తిపీఠాన్ని దర్శించుకోవాలి.
తుల
ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యతగా ఉంటారు. వాహనాల ద్వారా పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి పనులు సకాలంలో పూర్తి కాకపోయినా.. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. ఉద్యోగులకు ఆశించిన బదిలీలు ఉంటాయి. శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పిల్లల శుభకార్యాలు చేస్తారు. కొత్త ప్రయత్నాలూ ఫలిస్తాయి. భార్యాపిల్లలతో సుఖంగా గడుపుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలు, నగలను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రద్ధతో పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. విఘ్నేశ్వర స్తోత్రం పఠించాలి.
ధనుస్సు
అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి లాభదాయకం. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనడంపై మనసు పెడతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో కొన్ని ఒడుదొడుకులు ఉంటాయి. బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. పనులలో ఆటంకాలు ఉంటాయి. శుభకార్యాలు, శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగవు. లక్ష్మీదేవిని పూజించండి.
మకరం
వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. న్యాయవాద, వైద్య, ఇంజినీరింగ్ వృత్తులలో ఉన్న వారు ప్రశాంతంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో అనుకూలత ఉంటుంది. పై అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. దానధర్మాలు చేయండి.
కుంభం
సమయానికి పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులలో వేగం పెరుగుతుంది. ఇంట్లో భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో వైషమ్యాలు తలెత్తవచ్చు. వాహనాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మృత్యుంజయ స్తోత్రం చదువుకోవాలి.
మీనం
పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. నూతన వస్ర్తాలు, వస్తువులను కొంటారు. విందులు, వినోదాలకు ప్రాధాన్యం ఇస్తారు. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయ దారులకు అనుకూలం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సూర్యారాధన మంచిది.