రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్యాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. వ్యాపారంలో సమస్యలు తీరుతాయి. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలనం అవకాశం. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తుల పంపకాలలో ముందడుగు పడుతుంది. స్థిరచరాస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు. ఇంటి మరమ్మతులు, గృహ నిర్మాణం వంటి పనులు చేపడతారు.
తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నలుగురిలో గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం, కొత్త వ్యక్తుల పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆస్తి విషయంలో అన్నదమ్ములతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పనులలో ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ పనులలో ఆలస్యం జరగవచ్చు. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులతో కాలం గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో అనుకూలం. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. స్నేహితుల ప్రోత్సాహం లభిస్తుంది.
వ్యాపారులకు మంచి సమయం. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. భాగస్వాముల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. అన్నదమ్ములతో విభేదాలు తలెత్తవచ్చు. వాగ్వాదాల జోలికి వెళ్లకండి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రాబడి పెరుగుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. పోటీ పరీక్షలలో నెగ్గుతారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటి వారితో స్నేహంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
ఆత్మీయుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. న్యాయ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. ప్రతికూల ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో పనులు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనులలో జాప్యం జరుగుతుంది. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములతో వివాదాలు ముందుకు రావచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. భూ వ్యవహారం లాభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఆలస్యం జరుగుతుంది. కోర్టు పనులు కలిసివస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. భక్తి పెరుగుతుంది.
రావలసిన డబ్బు అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలు, విందులకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్థానచలనం ఉండవచ్చు. పనిభారం పెరిగినప్పటికీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తిగా, లాభదాయకంగా కొనసాగుతుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. విహారయాత్రలు చేపడతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అందకపోవడంతో పనులలో ఆలస్యం జరుగుతుంది. భక్తి పెరుగుతుంది. నలుగురికి సాయపడతారు. సేవాభావంతో ఉంటారు. తగాదాలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. అనవసరమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందిపడతారు. కార్యనిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. కొత్త పనుల ఆలోచనకు స్వస్తి చెప్తారు. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో విభేదాలు రావచ్చు. నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ వారం సమయానుకూలంగా వ్యవహరించండి.
ఈ వారం లాభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, పనులు పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సూచనలతో పనులు నిర్వర్తిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. అన్నదమ్ములు, బంధువులతో కార్యసాఫల్యం ఉంటుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల సూచనలు పాటించడం వల్ల లాభం పొందుతారు.
రాజకీయంగా అనుకూల వారం. ప్రభుత్వ పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ఉత్సాహంతో ఉంటారు. సంతృప్తిగా పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు నలుగురి సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయికతో ఇల్లు సందడిగా మారుతుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. పనిలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది.
శృంగార కోరికలు.. ఏ రాశివారిలో ఎలా ఉంటాయో తెలుసా..?
“Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..