శృంగార కోరికలు.. ఏ రాశివారిలో ఎలా ఉంటాయో తెలుసా..?
శృంగారం ఓ గొప్ప అనుభూతి. ఆలుమగల మధ్య హద్దులను చెరిపేసి.. మనసులను ఏకం చేస్తుంది.. మైమరిపిస్తుంది.. మురిపిస్తుంది.. ఆనంద క్షణాలను పంచుతుంది.. అంతే కాదు.. ఇద్దరి మధ్య ప్రేమను మరింత రెట్టింపు చేస్తుంది. అంతటి గొప్ప కార్యం.. ఈ శృంగారం. మరి శృంగార కోరికలు.. ఏ రాశి వారిలో ఎలా ఉంటాయో.. ఎలాంటి కోరికలను కలిగి ఉంటారనే విషయాలను తెలుసుకుందాం..
వృశ్చిక రాశి(Scorpio)
అన్ని రాశుల్లో కెల్లా ఈ రాశిని శృంగార సూచికగా కూడా పిలుస్తారు. ఈ రాశి వారు అత్యధికంగా శృంగార కోరికలను కలిగి ఉంటారు. భార్యాభర్తలిద్దరూ పడక గదిలో ఉన్నప్పుడు శృంగారాన్ని తనివితీరా అనుభవిస్తారు. బెడ్ రూమ్‌లోనే అధిక సమయం ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు.
మేష రాశి(Aries)
పడక గదిలో అధిక సమయం గడిపేందుకు ఇష్టపడుతూనే.. తీవ్రమైన, ఉద్వేగభరితమైన కోరికలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు శృంగారాన్ని ఒక సహజ అంశంగా పరిగణిస్తారు. అయితే ఈ రాశివారు సహజంగానే ఆవేశాన్ని కలిగి ఉంటారు కాబట్టి.. ఇంటర్ కోర్స్‌ను కూడా ఆ విధంగానే జరిపేస్తారు.
కర్కాటక రాశి(Cancer)
ఈ రాశి వారికి శృంగారం అనేది ఒక భావోద్వేగ కోరిక. పార్ట్నర్తో ఎక్కువగా కలలు కంటూ.. రొమాన్స్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. నిజంగా తమను ప్రేమిస్తున్నారు అనుకున్నప్పుడే అవతలి వ్యక్తితో శృంగారానికి ఇష్టపడుతారు. అయితే ఒక్కసారి అనుబంధం ఏర్పడిందంటే.. ఉత్తమ భావప్రాప్తిని అందించే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
వృషభ రాశి(Taurus)
ఈ రాశుల వారు శృంగారం అనగానే వాలిపోతుంటారు. శృంగారమే జీవితంగా బతికేస్తారు. ఇంద్రియాలను ప్రేరేపించే లైంగిక కలయికలను అధికంగా ఇష్టపడుతారు. పార్ట్నర్ యొక్క అవసరాలను తీర్చడంలో ఈ రాశుల వారు దిట్ట.
మీన రాశి(Pisces)
మీన రాశి వారు రొమాంటిక్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శృంగారంలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ప్రేమను పంచుతూ.. కలల్లో విహరిస్తూ ఉండేందుకు ప్రాధాన్యమిస్తారు. తన పార్ట్నర్తో త్వరగా కలిసి పోతారు.
కన్య రాశి(Virgo)
ఈ రాశి వారు బహిరంగంగానే తమ శృంగార కోరికలను వెలిబుచ్చుతారు. శృంగారం సమయంలో అసభ్య పదజాలం మాట్లాడేందుకు ఇష్టపడుతారు. వీరిని పడక గది రాజులు అని కూడా పిలుస్తారు.
సింహ రాశి(Leo)
సింహ రాశి వారు తమ భాగస్వామికి మానసికంగా, శారీరకంగా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తారు. ఈ రాశి వారు శృంగార జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే తరుచూ ఈ రాశి వారు ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు. ఇక పడక గదిలో భాగస్వామికి అధిక ఆనందాన్ని ఇస్తారు.
ధనుస్సు రాశి(Sagittarius)
ఈ రాశి వారు శృంగారం పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఇక పడక గదిలో శృంగారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. పార్ట్నర్కు మంచి అనుభూతిని అందిస్తారు. ధనుస్సు రాశి వారి కోరికలు కూడా విచిత్రంగా ఉంటాయి.
మిధున రాశి(Gemini)
ఇక ఈ రాశి వారు కూడా అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించేందుకు ఇష్టపడుతారు. పడక గదిలో స్త్రీ కీలక పాత్ర వహిస్తుంది. కొత్త కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ రాశి వారితో శృంగారంలో పాల్గొనాలనుకుంటే ఓపెన్ మైండ్‌తో వెళ్లాలి.
మకర రాశి(Capricorn)
ఈ రాశి వారు తమ శృంగార జీవితాన్ని ఎవరితోనూ చర్చించేందుకు ఇష్టపడరు. అన్ని రకాలుగా సుఖం పొందేందుకు ఇష్టపడుతారు.
తులా రాశి(Libra)
తులా రాశి వారు తమ జీవిత భాగస్వామి కోరుకున్న తృప్తి కంటే అధిక ఆనందాన్ని ఇస్తారు. అందుకోసం ఆ విధంగా ప్రయత్నిస్తారు కూడా. భాగస్వామికి భావప్రాప్తిని ముందుగానే అందించి.. ఉత్తేజితులను చేస్తారు.
కుంభ రాశి(Aquarius)
ఈ రాశి వారు తమ శృంగార కోరికలను బయటకు చెప్పరు. శృంగారానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఒకసారి జీవిత భాగస్వామి మనసుకు దగ్గరైతే.. అసాధారణ పద్ధతిలో, ఓపెన్ మైండ్‌తో ఉండిపోతారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

