ఈ వారం రాశి ఫలాలు.. జూన్ 28.6.2026 నుంచి 04.07.2026 వరకు
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త. శివాలయాన్ని సందర్శించండి.
మేషం
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త. శివాలయాన్ని సందర్శించండి.
వృషభం
పనిభారం పెరుగుతుంది. సమర్థంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిర్మాణ పనులు కొన్నిరోజులు వాయిదా వేసుకుంటే మంచిది. సమయ పాలన పాటించడం అవసరం. ఇష్టదైవాన్ని పూజించండి.
మిథునం
తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సమాజంలో మంచిస్థితిలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. తద్వారా పనులు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
గతంతో పోలిస్తే ఈ వారం ఉన్నతంగా ఉంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థానచలన సూచన. ఖర్చుల నియంత్రణ పాటించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ చేయు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ పనులు ప్రారంభిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
కన్య
వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన శుభప్రదం.
ధనుస్సు
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మకరం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలం. ఉద్యోగులకు అధికారుల అదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో ఖర్చులు పెరగవచ్చు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కుంభం
బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు.
నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రామాలయాన్ని దర్శించుకోండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

