పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కుదురుతుంది. విద్యార్థులకు శుభసమయం. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.
వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాబడి మార్గాలు పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరగవచ్చు. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు నిర్ణయాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కోర్టు కేసుల్లో ఊరట లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. సూర్యారాధన శ్రేయస్కరం.
పిల్లల విషయంలో అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టు ఖర్చులు ముందుకువస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. మామూలు పనులు కూడా అతికష్టం మీద పూర్తవుతాయి. బంధువులతో కార్యసిద్ధి ఉంది. బాకీల వసూలులో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులకు కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. పలుకుబడి ఉన్నవ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వారాంతం సంతృప్తికరంగా ముగుస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. భూ లావాదేవీల్లో తొందరపాటు తగదు. కోర్టు కేసుల్లో జాప్యం జరగవచ్చు. పెద్దల మాటలను గౌరవించడం అవసరం. ఆరోగ్యం మందకొడిగా ఉంటుంది. మాటతీరు వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటారు. వివాదాల్లో తల దూర్చవద్దు. వారాంతంలో అనుకూల మార్పు ఏర్పడుతుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
విద్యార్థులు, కళాకారులకు ఈ వారం అనుకూలం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల నియంత్రణ అవసరం. నూతన పెట్టుబడుల ఆలోచన పక్కన పెట్టండి. శ్రమ పెరుగుతుంది. నూతన ఒప్పందాల జోలికి వెళ్లకండి. ఆన్లైన్ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్తగా ప్రారంభించిన పనులలో జాప్యం జరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సూర్యారాధన శ్రేయస్కరం.
నూతన నిర్మాణాలు మొదలుపెడతారు. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. బంధువర్గం మూలంగా కార్యసిద్ధి ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. శ్రద్ధగా పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. భూముల కొనుగోలు విషయంలో కొంత కలిసివస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.
డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రామాలయాన్ని సందర్శించండి.
ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. దక్షిణామూర్తిని ఆరాధించండి.