రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నూతన వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికం అవుతాయి. పెద్దల సలహాలను పాటిస్తే మంచిది. రాబడి మార్గాలను అన్వేషిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సమస్యలు ఎదురవుతాయి. ఉత్పాదకత కుంటుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. పనులు వేగంగా చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారంలో అనుకున్న స్థాయిలో రాణిస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. అత్యుత్సాహంతో అందివచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేస్తారు. సేవకుల వల్ల చికాకులు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. స్నేహితులతో గతంలో ఏర్పడిన వైరుధ్యాలు తొలగిపోతాయి. పలుకుబడి పెరుగుతుంది.
గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపార ఒప్పందాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వారాంతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఖర్చులకు తగ్గ ఆదాయం ఉంటుంది. స్నేహితులతో కలహాలు ఉంటాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. అన్నదమ్ములు, బంధువర్గంతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. పని ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులు, బంధువర్గంతో ఇబ్బందులు ఉండవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. ఆహార నియమాలు పాటించడం అవసరం.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తారు. నూతన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని పనులు వాయిదా పడవచ్చు. పనివారితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయదారుల రాబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తే అదృష్టం తోడవుతుంది. వ్యాపారంలో అస్థిర ఫలితాలు ఉంటాయి.
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. జాగ్రత్త అవసరం. మంచి ఆలోచనలు చేస్తారు. అయితే, వాటిని అమలు చేయడంలో జాప్యం జరగవచ్చు. వృత్తిపరంగా తాత్కాలిక ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం అనుకున్నంత ఉండకపోయినా పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అన్నదమ్ములతో సఖ్యత లోపించవచ్చు. రోజువారీ పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
రావలసిన డబ్బు అందుతుంది. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితులు, బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగంలోని వారికి పనులు ఆలస్యం అవుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వివాదాలు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చులకు తగ్గ ఆదాయం ఉంటుంది. అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులతో అనుకూల సంబంధాలు ఉంటాయి. నిర్మాణరంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. అధికారులు, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శ్రద్ధతో పనులు పూర్తిచేస్తారు.
ఈ వారం తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. న్యాయ పరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిధుల లేమితో కొన్ని పనులు వాయిదా పడవచ్చు. వ్యాపారులకు చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అన్నదమ్ములతో వైషమ్యాలు తొలగిపోతాయి. ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
నలుగురికి ఉపయోగపడే పనులపై శ్రద్ధ చూపుతారు. ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. అధికారులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ఆత్మీయులతో మనస్పర్ధలు ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా పాత వాటిని పూర్తిచేయడం మంచిది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. అయితే అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది.
ప్రారంభించిన పనులు అనుకూలిస్తాయి. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తగదు.