ఈ వారం అనుకూలంగా ఉంది. భార్యా పిల్లలతో, కుటుంబసభ్యులందరితో ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పిల్లల చదువు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో సామరస్యం ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అయితే మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. స్నేహితులు, బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు ఉంటాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చును. సమయపాలన పాటించడం చాలా అవసరం. వారం మధ్య నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. బంధువులతో మాటపట్టింపులకు పోకండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులు, పెద్దల సలహాలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో కలహం ఏర్పడవచ్చు. మాటపట్టింపులకు పోవద్దు. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. రుణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.
విద్యార్థులకు కలిసివస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. సూర్యారాధన మేలుచేస్తుంది.
అన్నిటా విజయాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి, మంచిపేరు వస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈశ్వరారాధన మేలుచేస్తుంది.
ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. భారీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వారాంతంలో ఆకస్మిక ధనలాభం ఉంది. ఈ వారం నిబద్ధత చాలా అవసరం. నిత్యం కాలభైరవాష్టకం పఠించండి.
వ్యాపారం బాగా కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న చికాకులు ఉంటాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం సంతోషంగా సాగుతుంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిర్ణయాలు తీసుకునేముందు పెద్దల సలహాలు పరిగణనలోకి తీసుకోవడం అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి కలసివస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అయితే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పెద్దల సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పఠించండి
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. అయినవారిని దూరం చేసుకోకండి. ఎదుటివారి మనసు తెలుసుకొని మసులుకోవడం చాలా అవసరం. మీ పరువుకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివారాధన మేలుచేస్తుంది.
గతవారంతో పోలిస్తే ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత చెడకుండా చూసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in