రోజువారీ వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శుభ సమయం. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార విస్తరణకు అడుగులు పడతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
పని భారం పెరుగుతుంది. శుభకార్యాలకు డబ్బు వినియోగిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి. వారం మధ్యలో ఖర్చులు అధికమవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. నిర్మాణ పనులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహార నియమాలు పాటించడం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించండి.
చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా దూరమవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకొని, వాటిని చాకచక్యంగా అమలుపరుస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం అనుకూలంగా ఉంది. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆత్మీయులతో విభేదాలు రావొచ్చు.సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. శుభకార్య యత్నాలు ముందుకుసాగుతాయి. శివారాధన శుభప్రదం.
ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు. బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలుపరుస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. విద్యార్థులు శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. శని బలంగా యోగిస్తాడు. గురుబలం తక్కువ. పనులు మందకొడిగా సాగుతాయి. స్నేహితుల సహకారం అవసరం. సహోద్యోగుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కళాకారులకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారులకు వారాంతంలో మేలు కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టదేవతార్చన శుభప్రదం.
స్నేహితుల అండదండలు లభిస్తాయి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. బంధువుల సహకారంతో సత్ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. మనసుకు నిలకడ వస్తుంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మనోబలంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సాహితీవేత్తలకు అనుకూలమైన వారం. తీర్థయాత్రలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది.
ఈ వారం ఆర్థికంగా పుంజుకుంటారు. ఆనందంగా ఉంటారు. పనుల్లో జాప్యం జరిగినా.. సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. స్నేహితుల వల్ల మానసిక ఆనందం పొందుతారు. ఇంట్లో కలహ వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాముల నిర్ణయాలను పునఃసమీక్షించడం అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శివారాధన శుభప్రదం.
తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్న కార్యం నెరవేరుతుంది. తల్లిదండ్రుల సూచనలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వారంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో మేలు జరుగుతుంది.
పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వారి సాహచర్యం లభిస్తుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. ఇంటాబయటా సంతృప్తి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు రావొచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
ఇష్టదేవతార్చన మేలు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపారులకు మంచి సమయం. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పదోన్నతి పొందే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సమయానికి సాయం అందుతుంది. కళాకారులకు ఆదరణ పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం
నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in