తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు అదృష్టం కలసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. స్నేహితుల వల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. విద్యార్థులకు కలసివస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అయితే కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. సహోద్యోగులతో మాటపట్టింపులు ఉండవచ్చు. వాదోపవాదాలకు తావు ఇవ్వకండి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. రామాలయాన్ని సందర్శించండి.
తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. కొత్త ఒప్పందాల విషయంలో అత్యుత్సాహం పనికిరాదు. భాగస్వాములతో మాటపట్టింపులు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. నిత్యం కాలభైరవాష్టకం పఠించండి.
పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపారులకు అదృష్టం కలసివస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. తీర్థయాత్రలు చేపడతారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.
ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. రాబడిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వారాంతానికి పరిస్థితిలో అనుకూలమైన మార్పు వస్తుంది. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు వినండి.
ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి, సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగులకు అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. హనుమాన్ చాలీసా పఠించండి.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు అనుకూలమైన వారం. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. రుణ బాధలు కొంతవరకు తొలగిపోతాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. పెద్దల సూచనలు పాటించడం చాలా అవసరం. వివాదాలకు తావు ఇవ్వకండి. అర్ధాష్టమ శని కారణంగా కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. తల్లితో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. వారాంతంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక లబ్ధి పొందుతారు. శివారాధన మేలుచేస్తుంది.
కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు అందుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఆరోగ్యంపై దృష్టిపెట్టండి. ఎదుటివారి మనసు తెలుసుకొని ప్రవర్తించడం అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. సమయపాలన పాటించడం అవసరం. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. సహోద్యోగులతో చికాకులు తలెత్తుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. అన్నదమ్ములతో సఖ్యత చెడకుండా చూసుకోండి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. హనుమాన్ చాలీసా పఠించండి.