తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతతో పనులు చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వెలువడుతాయి. పట్టుదలతో కార్యాలు చక్కబెడతారు. రాబడి క్రమంగా పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. సోమవారం శివాలయాన్ని సందర్శించండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో కదలిక ఉండకపోవచ్చు. రాబడి మందగిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. సంయమనంతో ఉండండి. అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులకు మంచి సమయం. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారాంతంలో శుభవార్త వింటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. దత్తత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ప్రయోజనం చేకూరుతుంది. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. బంధువర్గంతో మనస్పర్ధలు రావొచ్చు. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. భూ లావాదేవీల్లో లబ్ధి చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా, బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యారాధన శుభప్రదం.
ఈ వారం కలిసివస్తుంది. వృత్తివ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విహారయాత్రలు చేస్తారు. కొత్త పరిచయాలు, భూ లావాదేవీలు జాగ్రత్త. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిర ఆదాయం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సంయమనంతో వ్యవహరించండి. లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాలు బలపడతాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తలచిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సూచనలను పాటించడం వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. ఇంటా బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. అందరితో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. వాహనం, భూమి కొనుగోలు చేయవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ పనులు అనుకూలంగా ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. వారాంతంలో అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వారాంతంలో
శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్తిర, చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగులతో చికాకులు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.