ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వారం మధ్యలో మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. మాతృవర్గం సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. పలుకుబడి పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
శారీరక సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టనివారితో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన పాటించడం అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. ఆగ్రహావేశాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు వాయిదాపడతాయి. వైష్ణవాలయ దర్శనం మేలుచేస్తుంది.
ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాలయాపనకు చోటివ్వకండి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన ముందుకు కదలవు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. భూమి కొనుగోలు, వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.
ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయుల సూచనలు అమలుచేయడం ద్వారా మేలు కలుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. శివారాధన శుభప్రదం.
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అన్నదమ్ములతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆంజనేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. సమయపాలన పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. సూర్య ఆరాధన మేలుచేస్తుంది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in