శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. పిల్లల పైచదువుల ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. పెద్దలతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భక్తి పెరుగుతుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. డబ్బు సమయానికి అందక పోవచ్చు. కిందిస్థాయి వ్యక్తులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి వచ్చినా ఇతరత్రా సమస్యలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి.
వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్నవారికి కలిసి వస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. పెద్ద పరిచయాల వల్ల కొన్ని పనులు అనుకూలిస్తాయి. అనవసర ప్రయాణాలు తప్పవు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో వారికి కొత్త అవకాశాలు. తీర్థయాత్రల వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో కాలయాపన. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందినా, వినియోగించు కోవడంలో ఆలస్యం. దత్తాత్రేయ ఆరాధన మంచి చేస్తుంది.
రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు సకాలంలో అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. విహార యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలలో మనసు నిలుపుతారు. కుటుంబంలో మనస్పర్ధలు తలెత్తుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి. సద్గురు సేవ చేసుకోవాలి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మంచి పేరు సంపాదిస్తారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులు, బంధువులతో మనస్పర్ధలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు. కీలక వ్యక్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త వ్యాపారాలోచన వాయిదా వేసుకోవడం మంచిది. రావలసిన డబ్బు అందుతుంది. హనుమాన్ చాలీసా చదవండి.
భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో వారికి కొత్త అవకాశాలు వస్తాయి. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్న వారికి ప్రయోజనకరం. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు లాభదాయకం. ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మెల్లగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. డబ్బు అందక పోవచ్చు. ప్రయాణాల వల్ల అలసట, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. దేవీ ఉపాసన శుభకరం.
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందుతాయి. విహార యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బు సమయానికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకూల ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. మంచి పేరు పొందుతారు. శివాలయాన్ని సందర్శించండి.
భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. నగలు కొనుగోలు చేస్తారు. కళాత్మక వృత్తులలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. కొత్త పనులు చేయాలనే ఆలోచన వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు లాభదాయకం. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు సకాలంలో అందకపోవచ్చు. రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంటుంది. నవగ్రహ స్తోత్రం పఠించాలి.
ప్రధాన గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్త అవసరం. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. భార్యా పిల్లల సహాయ సహకారాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. ఆత్మీయులతో వైషమ్యాలు ఎదురవుతాయి. భూముల వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయి. అన్నదానం చేయండి.
ఆత్మీయులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. చాలా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూల సమయం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. డబ్బు సకాలంలో అందక పోవచ్చు. లక్ష్మీదేవిని ఆరాధించాలి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. పేరు సంపాదిస్తారు. అధికారుల ఆదరణ ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. అనుకున్న ప్రాంతాలకు బదిలీలు లభిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. తల్లిదండ్రులు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందుతాయి. విహార యాత్రలు చేస్తారు. కుల దైవాన్ని పూజించాలి.
తోటి ఉద్యోగులతో సమన్వయం ఉంటుంది. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉల్లాసంగా ఉంటారు. క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి కలిసి వస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇష్టదేవతారాధన శుభాలను ప్రసాదిస్తుంది.
–గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in