పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా పూర్తవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో వ్యవహరించండి. పనిలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి.
సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలతో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే అనవసరమైన ఖర్చులతో కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. నిర్ణయాలలో కొంత అప్రమత్తత అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో పనుల్లో ఆలస్యం. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారులతో ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పూర్వం చేసుకున్న ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.
పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. అయితే, తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సంయమనం అవసరం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. మిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
పిల్లలు చదువులో రాణిస్తారు. పైచదువులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. గౌరవంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినప్పటికీ, శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. అనవసరమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సాహితీవేత్తలకు, కళాకారులకు అవకాశాలు వస్తాయి. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. ఆదాయంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. కుటుంబపెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో చిన్నపాటి మనస్ఫర్ధలు రావచ్చు. అధికారుల విమర్శలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే, వృథా ఖర్చులు ఉండవచ్చు. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులను పూర్తిచేయడంపై శ్రద్ధ చూపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి పరంగా గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండి, పనులు నెరవేర్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికం. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూలం. ప్రభుత్వ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలతో కొన్ని పనులు నెరవేరినా జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు.