ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రద్ధగా పనులు నిర్వర్తిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సౌఖ్యంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. హోటల్, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాబడిని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. అన్నదమ్ములతో సఖ్యత చెడకుండా చూసుకోండి. పెద్దల సూచనలు పాటించడం అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.
చాలా పనుల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. అన్నదమ్ములు, స్నేహితులతో మనస్పర్ధలు రావచ్చు. ప్రయాణాల వల్ల అలసిపోతారు. వారం మధ్య నుంచి అనుకూల ఫలితాలు మొదలవుతాయి. ఆర్థికంగా బలపడతారు. గృహ నిర్మాణ పనుల్లో కదలిక వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కళారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. అనుకూల బదిలీలు, పదోన్నతికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయానికి సాయం చేసేవారు ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. తీర్థయాత్రలు చేపడతారు. పెద్దల సహకారం పొందుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. సహోద్యోగుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రామరక్ష స్తోత్రం పఠించండి.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి. రోజువారీ వ్యాపారంలో చికాకులు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో ఏమరుపాటు తగదు. శుభకార్య ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అన్నదమ్ములు, బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనులలో పట్టుదల, ఏకాగ్రత కనబరుస్తారు. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శివారాధన శుభప్రదం.
రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పనులలో జాప్యం జరగవచ్చు. వివాహాది శుభకార్యాల్లో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. బంధువులు, స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సలహాలు, సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. ఆత్మీయులు, స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో సంయమనంతో వ్యవహరించడం అవసరం. లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాతబాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కళాకారులకు అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులుంటాయి. అందరి సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో కార్యసాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in