పనులు సకాలంలో పూర్తవుతాయి. సంపద పెరుగుతుంది. మాటతీరుతో అందరి మెప్పు పొందుతారు. ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు మంచివారం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సూర్యారాధన శుభప్రదం.
శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తివ్యాపారాల్లో సాటివారి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగులకు మంచి సమయం. బంధుమిత్రులతో కార్యసాఫల్యం ఉంది. రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు వెలువడతాయి. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వారాంతంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. శివాలయాన్ని సందర్శించండి.
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. పలుకుబడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
పాత బాకీలు వసూలు అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. గణపతి ఆరాధన శుభప్రదం.
ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు బరువు, బాధ్యతలు పెరిగిననూ సంతోషంగా స్వీకరిస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. శివారాధన మేలుచేస్తుంది.
అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రాదుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. శుభకార్యం కారణంగా ఖర్చులు పెరగవచ్చు. రామాలయాన్ని సందర్శించండి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in